Saturday, April 27, 2024

మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ వల్లే సాధ్యం

spot_img

మహబూబ్ నగర్: నిత్యం తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పరితపించే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు మరొకసారి అవకాశం ఇవ్వాలని, ఆశీర్వదించి మరోసారి అసెంబ్లీకి పంపాలని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. అభివృద్ధిని కొనసాగించడంతోపాటు మీకు ఇప్పటిలాగే ఎప్పటికీ ఆపదలో అండగా ఉంటాడని ఆపదొస్తే ఆదుకుంటాడని.. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని, ప్రజలందికీ అండగా ఉంటాడని అందుకే మహబూబ్ నగర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ వల్లే సాధ్యమని ఆయన అన్నారు.

Also Read.. పిల్లలను అమరవీరులను చేసిందే కాంగ్రెస్. వాళ్లే ఇప్పుడు సంతాపం తెలుపుతున్నరు.. కేటీఆర్ ఫైర్

శుక్రవారం నాడు పట్టణంలోని షాసాబ్ గుట్ట, మోటార్ లైన్ మసీదుల వద్ద నమాజ్ అనంతరం మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాసాబ్ గుట్ట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనారిటీ సోదరులకు చేసిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రూ.120 కోట్లతో మైనారిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 6 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 6 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామని భవిష్యత్తులో వాటిని డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేట్ చేస్తామన్నారు. మహబూబ్ నగర్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యాలకు నిలయంగా మార్చామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి హజ్ హౌస్ మహబూబ్ నగర్ లో నిర్మించామని అన్నారు.

Latest News

More Articles