Saturday, April 27, 2024

బతుకమ్మను పేర్చి ఆశ్చర్యపరిచిన మంత్రి జగదీష్ రెడ్డి

spot_img

సూర్యాపేట : సూర్యాపేట విద్యానగర్‌లో మంత్రి జ‌గదీశ్ రెడ్డి నివాసంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులతో కలిసి బతుకమ్మను పేర్చి ఆశ్చర్యపరిచారు. తీరొక్క పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ వేడుకల్లో మంత్రి సతీమణి సునీత జగదీష్ రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు.

Also Read.. ఆప్‌ ఎంపీ సంజ‌య్ సింగ్‌ కు ఢిల్లీ కోర్టు వార్నింగ్

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్ర‌తిబింబం అన్నారు. ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా, ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ బతుకమ్మ పండుగ సంస్కృతి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేసింది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

More Articles