Sunday, May 5, 2024

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

spot_img

హైద‌రాబాద్ : ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.  నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ సంప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. రేపటినుంచి ఈనెల 16 వరకు ఫీజులు కట్టవచ్చు. విద్యార్థులకు ‘టెలి మానస్’  పేరుతో హెల్ప్ లైన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులుు 16641 నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.

విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్ద‌ు: మంత్రి సబిత

ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేసినట్లు మరోసారి గుర్తు చేశారు. ఫలితాల్లో ఫెయిలైన పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌ని.. జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే  అడ్వాన్స్ డ్ సంప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పేరెంట్స్ కూడా తమ పిల్లలపై ఒత్తిడి తేవొద్దని, విద్యార్థులకు అండగా నిలబడి వారికి ధైర్యం చెప్పాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సూచించారు.

ముఖ్యంశాలు:

  • ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 62.85% ఉత్తీర్ణత
  • ఇంటర్మీడియట్ సెకండియర్ 67.20% ఉత్తీర్ణత
  • ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచిన మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సెకండ్ ప్లేస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు థర్డ్ ప్లేస్.
  • సెకండియర్ ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచిన ములుగు జిల్లా
  • ప్రయివేట్ జూనియర్ కాలేజీలో పాస్ పర్సేంటేజ్ 63 శాతం.
  • రెసిడెన్షియల్ కాలేజీల్లో పాస్ పర్సెంటెజ్ 92 శాతం.
  • సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో పాస్ పర్సెంటేజ్ 80 శాతం.
  • ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 63 శాతం ఉత్తీర్ణత
  • గురుకుల జూనియర్ కాలేజిీల్లో 92 శాతం ఉత్తీర్ణత
  • సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం ఉత్తీర్ణత
  • బీసీ గురుకులల్లో 87 శాతం ఉత్తీర్ణత
  • KGBV 77 ఉత్తీర్ణత
  • ట్రైబల్ గురుకులల్లో 84 ఉత్తీర్ణత
  • ప్రభుత్వ జూనియర్ కాలేజిీల్లో 54 శాతం ఉత్తీర్ణత
  • ఈ రోజు సాయంత్రం నుండి కలర్ మెమో లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • జూన్ 4 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
  • రేపటి నుండి రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ కి అవకాశం
  • ఈ నెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం

 

Latest News

More Articles