Thursday, May 9, 2024

గారడీగాళ్ల గ్యారెంటీలు నమ్మొద్దు

spot_img

రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్‌ఘాట్‌లో ఉన్న అనంతరెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.
గతంలో గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లు కనిపించేవని.. నేడు ప్రతి ఇంటి ముందు ముగ్గులు దర్శనమిస్తున్నాయన్నారు.

అంటే వలసలు వాపస్‌ వచ్చాయన్నారు. ఉన్నత చదువులకు పట్టణం పోవాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే మెడికల్‌, నర్సింగ్‌, ఇంజినీరింగ్‌, వ్యవసాయ, మత్స్య కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నామన్నారు. నూతనంగా నిర్మించేబోయే ఐటీ టవర్‌ వనపర్తికి మరో ఐకాన్‌గా నిలవనున్నదన్నారు.

ఎన్నికల వేళ గ్రామాల్లోకి వచ్చే మోసపూరిత నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. కొత్తగా గ్యారెంటీ లంటూ నాయకులు వస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దనానరు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, బీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles