Thursday, May 2, 2024

ఘనంగా బుద్ధ జయంతి.. నాగార్జున సాగర్ వరకు కార్ ర్యాలీ

spot_img

బుద్ధ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్‎లో ఉన్న బుద్ధుని విగ్రహం వద్ద జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య హాజరయ్యారు. ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 2,567వ బుద్ధ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నుంచి పీస్ కార్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్ ర్యాలీ నాగార్జున సాగర్ వరకు జరగనుంది. ఈ ర్యాలీలో దాదాపు 200 కార్లు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం మనం బుద్ధ జయంతి వేడుకులు జరుపుకుంటాం. ఈ సారి ఓ పక్క సెక్రటరియేట్, మరో పక్క డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట ఈ కార్యాక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో ఎక్కడ తవ్వకాలు జరిపినా బుద్ధుని విగ్రహాలు బయట పడుతున్నాయి. బుద్ధునికి ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంకా ఎన్నో విజయలను సాధించబోతోంది.

Latest News

More Articles