Saturday, May 4, 2024

నుమాయిష్ 2023 ప్రారంభం.. 10 వేల మందికి ఉపాధి

spot_img

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డిలు 82వ నుమాయిష్(నాంపల్లి ఎగ్జిబిషన్)ను ప్రారంభించారు. నుమాయిష్ 2023 నేటి (జనవరి 1) నుండి 45 (ఫిబ్రవరి 15 వరకు) రోజుల పాటు కొనసాగనున్నది. ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాల తోపాటు, పలు దేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి.

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఎగ్జిబిషన్ లో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఎంతో మంది వ్యాపారులు పాల్గొంటారని తెలిపారు. ఎగ్జిబిషన్ లో ఎంతో అనుభూతి కలుగుతుందన్నారు. అన్ని రకాల సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ దర్శనమిస్తాయన్నారు.

మహిళల చదువుకు సొసైటీ పెద్దపీట

‘‘30 వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా విద్యను అందిస్తున్నారు. మహిళల చదువుకు ఈ సొసైటీ పెద్దపీట వేస్తున్నారు. ఈ సొసైటీలో చదివిన వారు ఎంతో మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. 10 వేల మంది ఈ సొసైటీ ద్వారా ఉపాధి పొందుతున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్ లు

ఈ 45 రోజుల పాటు కూడా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. కరోనాను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక్క హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ కు తరలిరావాలి. నగరం నలుదిశల నుంచి ఎగ్జిబిషన్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్ లు నడపుతుంది.’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Latest News

More Articles