Sunday, May 5, 2024

మేము గేట్లు తెరిస్తే.. కాంగ్రెస్ లో ఒక్కడు మిగలడు.. గంగుల ఫైర్

spot_img

ఈ రోజు తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశం లో కార్యకర్తలు మనసు విప్పి తమ అభిప్రాయాలు చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఇచ్చిన సూచనలు పరిగణన లోకి తీసుకుంటామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ను ఈ సారి కచ్చితంగా గెలిపించుకుంటామని కార్యకర్తలు శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల ఆధారంగా చూస్తే బీఆర్ఎస్ కరీం నగర్ పార్లమెంటు నియోజక వర్గంలో 5600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నామన్నారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ కు స్మార్ట్ సిటీ వచ్చిందంటే అది వినోద్ కుమార్ కృషే. కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోవడం కష్టంగా ఉంది. అలాగే వినోద్ కుమార్ ను ఎంపీగా ఓడించి కరీంనగర్ చాలా నష్టపోయిందీ. బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమి లేదు. మంత్రి శ్రీధర్ బాబు మేము తొందరపడుతున్నాం అంటున్నారు. మీరు హామీలకు తేదీలు చెప్పారు. వాటినే గుర్తు చేస్తున్నాం. రైతు బంధు ఇవ్వక పోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు. మేము రైతుల పక్షాన మాట్లాడటం తప్పా. డిసెంబర్ 9నే రైతు రుణ మాఫీ చేస్తామని రైతు బంధు వేస్తామని వాళ్ళే చెప్పారు.

యాసంగి పంటకు సిద్దమైన రైతులకు పెట్టుబడీ సాయం ఇవ్వాలా వద్దా.. బండి సంజయ్ మూడు సార్లు ఓడిపోయారు.. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ ను కూకటి వేళ్ళ తో పెకిలిస్తారా. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మాకు కేసీఆర్ దైవ సమానులు. ఎవ్వరూ బీఆర్ఎస్ ను వీడరు. మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ లో ఎవ్వరూ మిగలరు. మాకు ప్రభుత్వాన్నికూల్చే ఉద్దేశం లేదు. రాజగోపాల్ రెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక నెలలో ఇంత వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశం ఉంటుంది’ అని అన్నారు గంగుల.

Latest News

More Articles