Sunday, May 5, 2024

కార్పొరేటర్‎లు మనసు మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవు

spot_img

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‎కి చెందిన 16 మంది కార్పొరేటర్‎లు మనసు మార్చుకొని తిరిగి రాకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్‎కి చెందిన మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ పై 16 మంది కార్పొరేటర్లు ఈనెల 12వ తేదీన అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 16 మంది కార్పొరేటర్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సముదాయించే ప్రయత్నం చేసినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసమే 16 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారని అన్నారు. మేయర్ చేసిన అవినీతి, అక్రమాలు ఏంటో బయటపెట్టాలని, ఈ విషయం 16 మంది కార్పొరేటర్లు తన వద్దకు వస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకునేవాడినన్నారు. కానీ ఈ 16 మంది కార్పొరేటర్లు తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నారని, క్రమశిక్షణ చర్యల తీసుకోవాల్సిందిగా కేసీఆర్, కేటీఆర్‎లకు సిఫారసు చేస్తామని తెలిపారు.

Read also: ప్రాణప్రతిష్ట సమయంలో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ

Latest News

More Articles