Sunday, May 5, 2024

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు :ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

spot_img

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బండ్లగూడ MIM పార్టీకి చెందిన దర్గా కార్పొరేటర్ అస్లాం తన అనుచరులు100 మంది తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మున్సిపల్ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ సాగర్ గౌడ్ కోఆప్షన్ సభ్యులుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles