Sunday, May 5, 2024

ఆ తర్వాత పెండ్లయినోళ్లకే లక్ష.. తులం బంగారం

spot_img

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చిందని, ఆ తేదీ తర్వాత వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ప్రకటించిన విద్యా భరోసాను సైతం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.అర్హత కలిగిన ప్రతి వివాహితకు రూ.2500 సాయం అందిస్తామని తెలిపారు.

Read Also: న్యూఇయర్‌ వేడుకల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

జగిత్యాల రూరల్‌ మండలం పొలాసలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో శనివారం జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాపాలనలో స్వీకరిస్తున్న అభయ హస్తం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైనవారికి ఫిబ్రవరి నుంచి పథకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. గ్యారెంటీల అమలుకు అర్హులు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వమే దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో ఇంటి నిర్మాణం పథకాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేసిందని అన్నారు. చేయూత పథకం సైతం ప్రజలను అయోమయానికి గురిచేసిందని చెప్పారు. కొత్త పెన్షన్ల మంజూరును మూడేండ్లపాటు నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ పెన్షన్‌ వర్తింపజేస్తుందని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలోని సీపీడబ్ల్యూ పథకాలు పునరుద్ధరించాలని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన లబ్ధిపొందడం లబ్ధిదారుల హకు అని, అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.

Latest News

More Articles