Thursday, May 9, 2024

రాగల 3 రోజులపాటు మోస్తరు వర్షాలు..!

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు ,ఎల్లుండి అక్కడక్కడ  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ,  వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నవి తెలిపింది.

మరికొన్ని జిల్లాల్లో రాగల 3రోజులపాటు వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈరోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, కొత్త గూడెం,సూర్యాపేట,భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో  వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Latest News

More Articles