Sunday, May 5, 2024

కాలుకు సర్జరీ..ఆసుపత్రి బెడ్ పై స్టార్ బౌలర్.!

spot_img

టిమిండియా స్టార్ బౌరల్ మహమ్మద్ షమీ కాలుకు సర్జరీ అయ్యింది. అతని కాలికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోషేర్ చేశాడు. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా అందించాడు. త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెడతానని తెలిపాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని షమీ తెలిపాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో కాలుకు గాయం అయ్యింది. దీని కారణంగా షమీ ఈమధ్యే భారత్ ఆడిన పలు సిరీస్ లకు దూరం అయ్యాడు. ఈ మధ్యే భారత్ వర్సెస్ సిరీస్ కు కూడా సెలక్ట్ అయ్యారు. కానీ గాయం తగ్గకపోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ క్రమంలో గాయం మరింత ఇబ్బంది పెట్టింది. దీంతో షమీ శస్త్ర చికిత్స చేయించుకోవల్సి వచ్చింది. సోమవారం రోజు మడమకు ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ తర్వాత షమీ తన హెల్త్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా వచ్చే నెలల జరిగే ఐపీఎల్ తోపాటు జూన్ లో జరిగే వన్డే కప్ కు షమీని సెలక్ట్ చేయడం లేదని బీసీసీఐ ప్రకటించింది. కాలు గాయం కారణంగా కొన్నాళ్ల పాటు రెస్టు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే షమీని సెలక్ట్ చేయలేదని బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: గారాలపట్టి వామికతో విరాట్ కోహ్లీ ఫొటో వైరల్..!!

Latest News

More Articles