Thursday, May 2, 2024

న్యూజిలాండ్ క్రికెట్‌లో కరోనా కేసులు

spot_img

మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్‌లో క‌రోనా కేసులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ శాంట్న‌ర్ క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వేకు కూడా వైరస్ సోకినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం కాన్వే ఐసోలేష‌న్‌లో ఉన్నాడని, అతడిని క్లోస్ కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది. కరోనా పాజిటివ్‌ రావడంతో పాకిస్థాన్‌తో నేడు జ‌రిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో చాడ్ బోవెస్‌ను కివీస్ బోర్డు ఎంపిక చేసింది. కాన్వే ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్ హోటల్‌లో ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ ఆండ్రే ఆడ‌మ్స్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడ‌ని న్యూజిలాండ్ బోర్డు తెలిపింది.

Read Also: హోటల్లోకి చిరుత.. భయపడుతూనే వీడియోలు తీసిన స్టాఫ్

Latest News

More Articles