Saturday, May 11, 2024

ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం

spot_img

రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ప్రసంగించారు.
‘కేంద్ర ప్రభుత్వం పరిధులు దాటి వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు.. రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఎవరైనా అవినీతి చేస్తే చర్యలు తీసుకోవాలి.. హోంమంత్రిగా ఆ అధికారం మీకుంది.. ప్రజాస్వామ్యానికి ఎందుకు తూట్లు పొడుస్తున్నారు. కేజ్రీవాల్ బీజేపీ, కేంద్రాన్ని వణికిస్తున్నాడు. ఢిల్లీ అధికారులను గుప్పిట్లో పెట్టుకోవడం సరికాదు. అధికారులు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షకులంతా ఈ బిల్లును వ్యతిరేకించాలి

Latest News

More Articles