Friday, May 10, 2024

ఉప్పల్, అంబర్ పెట్ ఫ్లై ఓవర్లపై కేటీఆర్ ఆరా

spot_img

మంత్రి కే తారక రామారావు అధ్యక్షతన జీహెచ్ఎంసి కార్యాలయంలో 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర క్రీడలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉన్న ఉప్పల్, అంబర్ పెట్ రహదారిపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.

నిర్మాణంలో ఉన్న ఉప్పల్ ఫ్లై ఓవర్ కింద రోడ్డు పనులు అగ్రిమెంట్ ప్రకారం ఎన్ హెచ్ అధికారులు చేయాల్సి ఉందని జిహెచ్ఎంసి చెప్పింది. కేంద్రం చేతిలో ఉన్న ఫ్లై ఓవర్ ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఉప్పల్ లో రహదారి దెబ్బతిన్నదని వెల్లడించిది. 15, 20 రోజుల్లో ఉప్పల్, అంబర్ పెట్ రోడ్డు క్రింద రోడ్డు పనులు చేపట్టాలని ఎన్ హెచ్ అధికారులకు విజ్ఞప్తి చేయాలని..లేని పక్షం లో జిహెచ్ఎంసి చేపడుతుందని చెప్పారు. సమావేశంలో ప్రజల ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Latest News

More Articles