Thursday, May 2, 2024

విద్యార్థులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చిన బ్రిటన్

spot_img

బ్రిటన్‎లో చదువుకోవాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్కడ చదువుకునేందుకు భారత్‌తో పాటు విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు తమ వెంట బంధువులను తీసుకురాకూడదని రూల్ పెట్టింది. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ నిధులతో నడిచే కోర్సుల విద్యార్థులకు ఈ రూల్ పై మినహాయింపు ఇచ్చింది. బ్రిటన్‎లో విదేశీ విద్యార్థులతో పాటు బంధువుల సంఖ్య పెరగడంతో ఆ ప్రభుత్వం జనవరి 1 నుంచి నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటీష్ యూనివర్సిటీల్లో చదువుతున్న వారిలో చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉంటారు. ఇప్పుడు వారందరిపై ఈ నియమ ప్రభావం ఉండనుంది.

Read Also: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. నిమిషానికి 1,244 బిర్యానీలు, గంటకు 1722 కండోమ్‌ల ఆర్డర్

జనవరి 1 నుంచి అమలు చేస్తున్న వీసా ఆంక్షల కారణంగా భారత్‌తో సహా విదేశీ విద్యార్థులు తమ బంధువులను బ్రిటన్‌కు తీసుకురాలేరని ఆ దేశ హోం మంత్రి జేమ్స్ క్లీవర్లీ తెలిపారు. వేలాది మంది వలసలను తగ్గించడానికి.. దేశంలోని ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రజలు మార్చకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తుందన్నారు. కాగా, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 2022 నాటికి 7.45 లక్షల మంది వలసదారులు బ్రిటన్‌కు వచ్చారు. వీరిలో 1.39 లక్షల మంది భారతీయ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇలాంటి విద్యార్థుల కోసం బ్రిటన్ వచ్చే వారికి 1.52 లక్షల వీసాలు జారీ చేయబడినట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

Latest News

More Articles