Sunday, May 5, 2024

వైద్యం పేరుతో నవవధువుపై అత్యాచారం

spot_img

ట్రీట్మెంట్ నెపంతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం చేసిన ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణ సంఘటన బండ్లగూడ జాగీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న బజార్ బాబా వద్దకు అత్త మామలు తీసుకెళ్లారు. వైద్యం పేరుతో నవవధువును గదిలోకి తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి బాబా అత్యాచారం చేశాడు. ఈ విషయం అత్తమామలకు చెప్పినా స్పందించక పోగా.. ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు. తల్లిదండ్రుల సహాయంతో బాధితురాలు భవాని నగర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఘటన బండ్లగూడ ప్రాంతంలో జరిగింది కాబట్టి కేసును భవాని నగర్ పోలీసులు బండ్లగూడకు రెఫర్ చేశారు. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ బాబా కోసం గాలింపు చేపట్టారు.

Latest News

More Articles