Monday, May 6, 2024

ఆల్ బకరా పండ్లను తింటున్నారా?

spot_img

ఆల్ బకరా పండ్లు ప్రత్యేకంగా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. సీజన్ల వారీగా దొరికే పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. రుచికి పుల్లగా, తియ్యగా టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నందునా.. ఇది షుగర్ ఉన్న వారికి బెస్ట్ ఫ్రూట్.

మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు, ఖనిజాలు ఇందులో లభిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   ఇందులో  విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.

Nutrients in Aloo Bukhara Fruits and Benefits

ఆల్ బుకరా పండ్లు తింటే.. శ్వాస, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు రావు. వీటిలో ఉండే విటమిన్ ఎ నోటికి సంబంధిన క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి. శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచి రక్తహీనత సమస్యను పరిష్కరిస్తాయి.  ఈ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలో అలసటను తగ్గిస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి.

తరచూ డైట్ లో తినే ఫ్రూట్స్ తీసుకుంటే శరీరంలోని మలినాలను, చెడుకొవ్వును బయటకు పంపుతాయి.  ఇందులో అధికంగా ఉన్న ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం చర్మాన్ని గట్టిగా తయారు చేయడంలో సహాయపడుతాయి.  ఈ పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుందని న్యూట్రిషియన్స్ తెలిపారు.

Nutrients in Aloo Bukhara Fruits and Benefits

Latest News

More Articles