Tuesday, May 7, 2024

పద్మవిభూషణ్ …మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

spot_img

మెగాస్టార్ చిరంజీవికి రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. గురువారం రాత్రి 2024 పద్మ పురస్కారాలకు సంబంధించిన జాబితాను వెల్లడించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 17మందికి పద్మభూషణ్ తోపాటు 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందాయి.

పద్మవిభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో అభిమానుల్లో పట్టలేని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆయన నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. అంతేకాదు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని అనేక అవార్డులు, రివార్డులు అందించాయి.

ఈక్రమంలోనే 2006లో భారత ప్రభుత్వం అతిపెద్ద్ పురస్కారం అయిన పద్మ భూషన్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కోవిడో సమయంలో మెగాస్టార్ చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించింది. ఈ పురస్కారం పై చిరంజీవి ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మరింత బాధ్యత పెరిగిందని దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం తనకు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: జ్ఞాన్‌వాపి నివేదికపై ఒవైసీ ఆగ్రహం..ఏఎస్‌ఐ హిందుత్వ బానిస అంటూ ఫైర్..!

Latest News

More Articles