Sunday, May 5, 2024

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

spot_img

నేటి క్యాబినెట్ మీటింగ్ లో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. వరి పంటను ముందస్తుగా వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎందుకంటే వడ గండ్ల వానలు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాన కాలం ఒక్క నెల, యాసంగి ఒక్క నెల ముందుకు జరిపితే రైతులను కాపాడుకోవడానికి వీలు ఉంటుందని డెసిషన్ తీసుకున్నారు.

ఇక నకిలీ విత్తనాలపై కూడా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ పెట్టాలని చెప్పారు. ఇలా పిడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించిన మొదటి రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. నకిలీ విత్తనాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సీఎస్,డీజీపీ ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Latest News

More Articles