Tuesday, May 7, 2024

ఒక్కడే 400 కొట్టాడు.. యువ బ్యాటర్‌ సంచలన ఇన్నింగ్స్‌

spot_img

దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక యువ బ్యాటర్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అండర్‌ – 19 స్థాయిలో బీసీసీఐ నిర్వహించే కూచ్‌బెహార్‌ ట్రోఫీ ఫైనల్లో ప్రకర్‌ చతుర్వేది ఏకంగా 404 (638 బంతులు, 46 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబైతో జరుగుతున్న మ్యాచులో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగుల భారీ స్కోరు చేసింది.

Also Read.. 18 నుంచి ‘భార‌త్‌-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మ‌కం

ప్రకర్‌ చతుర్వేది సంచలన ప్రదర్శనతో కర్ణాటకకు ఆధిక్యంతో పాటు ట్రోఫీని కూడా సాధించిపెట్టాడు. చతుర్వేదితో పాటు హర్షిల్‌ ధర్మని (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్‌ (55 నాటౌట్‌)లు రాణించడంతో కర్నాటక భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. నాలుగు రోజులు ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్‌ ఉండటంతో కర్ణాటకను విజేతగా ప్రకటించారు.

Latest News

More Articles