Tuesday, May 7, 2024

ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి

spot_img

ఖమ్మం జిల్లా: స్థానికుడిని, భూమి పుత్రుడైన తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటానని, బయట వారిని గెలిపిస్తే గెలిచిన తర్వాత కనిపించరని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 21వ డివిజన్ లో ఆయన ప్రచారం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్రం వెనకబడడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళు ఇచ్చింది తక్కువ బుక్కింది ఎక్కువ అని పేర్కొన్నారు. 5 ఏళ్లలో 2500 డబుల్ బెడ్రూం ఇండ్లు తెచ్చానని, మళ్ళీ తనను గెలిపిస్తే 10వేల మంది పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి, గృహలక్ష్మి పథకం ద్వారా అందులో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

Also Read.. ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా?

గతంలో తన చేతులో ఓడిపోయిన వ్యక్తిని సీఎం కేసీఅర్ ఆదరించి మంత్రి పదవి ఇచ్చారని, ఆయన ఒక్కసారి కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదన్నారు. తన మీద పోటీ చేసే వ్యక్తి గతంలో నిధులు అన్ని సత్తుపల్లిలో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆయన తాను చేసిన అభివృద్ధి పనులను ఆయన చేసినట్లు చెప్తున్నారు. మందికి పుట్టిన బిడ్డను.. నా బిడ్డ అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు సిగ్గుండాలన్నారు.

Also Read.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దు

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పించాన్ కేవలం రూ.200 లే ఇచ్చేవారు, బీఆర్ యస్ వచ్చిన తర్వాత రూ.2000 చేశారు, వాటిని రూ.3 వేలు చేయాలని సీఎం కెసిఆర్ అనుకుంటున్నారు. మేము మళ్ళీ గెలిచిన తర్వాత రేషన్ షాప్ లలో సన్నబియ్యం అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ చాలా గ్యారెంటీ లు చెప్తుంది, వారికే గ్యారెంటీ లేదు రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తుంది. దేశాన్ని ఒక్క కుటుంబమే పాలించింది, కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Latest News

More Articles