Friday, April 26, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

spot_img

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట, ఎల్బీ నగర్‌, కొత్తాపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, ఓయూ, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ తదిరత ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది.

ఆదివారం సాయంత్రం కూడా నగరంలోని భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్లు సమాచారం.

Latest News

More Articles