Tuesday, May 7, 2024

రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ

spot_img

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మహాలక్ష్మి వచ్చింది.  మంగళవారం తెల్లవారుజామున  యంగ్‌ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ఒక బులెటిన్‌ విడుదల చేసింది. రామ్‌ చరణ్, ఉపాసనలకు 2012 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు బిడ్డ పుట్టబోతున్నట్లు రెండు కుటుంబాలు గత ఏడాది డిసెంబర్ 12న వెల్లడించాయి.

Latest News

More Articles