Sunday, May 5, 2024

మేము ఎప్పటికీ మీ అభిమానులమే సార్..!

spot_img

పరాజయాన్ని కూడా ఎంతో హుందాగా స్వీకరించిన కేటీఆర్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. మొదట స్టార్‌ యాంకర్‌ అనసూయ కేటీఆర్‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ‘మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. మీ హయాంలో ఎంతో పురోగతి సాధించిన హైదరాబాద్‌తో నేను ప్రేమలో పడ్డాను.. బలమైన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు సార్‌’ అంటూ ట్వీట్‌ చేసింది అనసూయ.

అలాగే ప్రముఖ దర్మకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా కేటీఆర్‌ ట్వీట్‌పై రియాక్ట్‌ అయ్యారు. ‘ఓటమిని ఇంత సానుకూల దృక్పథంతో స్వీకరించిన ఏ రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది’ అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. అలాగే మరో హీరో సందీప్‌ కిషన్‌ ‘మేము ఇప్పటికీ, ఎప్పటికీ మీ అభిమానులమే అన్నా’ అని కేటీఆర్‌ ట్వీట్‌కు కామెంట్‌ పెట్టాడు. మొత్తానికి ఓటమిని కూడా ఎంతో హుందాగా స్వీకరించిన మంత్రి కేటీఆర్‌కు అందరూ హ్యాట్స్‌ఫ్‌ చెబుతున్నారు.

Latest News

More Articles