Tuesday, May 7, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

spot_img

తిరుమల : గత రెండు రోజులుగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచియున్నారు. తుఫాన్‌ కారణంగా గత నాలుగురోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో భక్తులు రాక తగ్గుముఖం పట్టిందని టీటీడీ అధికారులు తెలిపారు.

బుధవారం స్వామివారిని 45, 275 మంది భక్తులు దర్శించుకోగా 14, 295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్‌ లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం రూ. 2.32 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Latest News

More Articles