Friday, May 10, 2024

భారత్‌కు రోల్‌మాడల్‌ కేటీఆర్‌

spot_img

హైదరాబాద్‌: ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావుపై అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్‌ రేఖి ప్రశంసలు కురిపించారు. రాజకీయంగా భారత్‌ మొత్తానికి కేటీఆర్ రోల్‌ మాడల్‌ అని ప్రశంసించారు. కేటీఆర్‌ ధ్యాస మొత్తం అభివృద్ధి, పెట్టుబడుల సాధనపైనే ఉంటుందని కొనియాడారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అమెరికాలోని నాస్‌డాక్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీలో తన కంపెనీని లిస్ట్‌ చేసిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌ గా రేఖి గుర్తింపుపొందారు. రేఖి ప్రస్తుతం అమెరికాలోని ‘ఇన్వెస్టస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌’ ఎండీగా పనిచేస్తున్నారు.

ప్రఖ్యాత ఫాక్స్‌కాన్‌ సంస్థ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఆదివారం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మంత్రి కేటీఆర్‌ను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా పోస్ట్‌ పెట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రోజురోజుకూ బలపడుతున్నదని రేఖి పోస్ట్‌ చేశారు.

Latest News

More Articles