Wednesday, May 8, 2024

దళిత, బహుజన స్త్రీ విద్యకోసం సాయిత్రిబాయి ఎంతో కృషి చేశారు-మంత్రి ఎర్రబెల్లి

spot_img

దళిత, బహుజన మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసిన మహానీయురాలు సాయితిబాయి ఫూలే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమె ఒక గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. మంగళ వారం సాయిత్రిబాయ్ ఫూలే జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందన్నారు. విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారన్నారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల పేర్లపైనే ఇండ్ల మంజూరు, కరేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తుందని చెప్పారు.

Latest News

More Articles