Monday, May 6, 2024

బిడ్డను కంటే 61లక్షలు ..సర్కార్ యోచన.!

spot_img

సౌత్ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో జననరేటును పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59వేల పౌండ్ల నగదు ఇచ్చే విషయాన్ని సర్కార్ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలో జననాల రేటు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.

2023లో ఇది 0.72కు తగ్గింది. అంటే దేశంలోని ప్రతి మహిళ ఒక బిడ్డకు కూడా జన్మినివ్వట్లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. 2023లో నమోదు అయిన జాతీయ జననరేటు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టమని చెప్పవచ్చు. దేశంలో జనాభా సంక్షోభానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత, దంపతులు వివాహ బంధానికి పిలలను కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: నేటి నుంచి గులాబీ బాస్ రోడ్ షో.. మిర్యాలగూడ నుంచి ప్రారంభం.!

Latest News

More Articles