Wednesday, May 8, 2024

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు షురూ.!

spot_img

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు షురూ అయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి, రెండో సంవత్సరానికి కలిపి 9లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 4,78,718 మంది, రెండో సంవత్సరం 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యం అయినా అనుమంతించమని అధికారులు తెలిపారు. ఎవరైనా కాపీ కొట్టినట్లుగా తెలిసినా, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం..బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు..31 మంది దుర్మరణం.!

Latest News

More Articles