Thursday, May 2, 2024

పెండింగ్‌ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు

spot_img

వాహనాల పెండింగ్‌ చలాన్ల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేటితో ముగియనున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. దాంతో వాహనదారులకు తమ వాహనాల చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మరోసారి అవకాశం లభిచింది. తొలుత గ‌త డిసెంబ‌ర్ 27 నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు జనవరి 10 వరకు అంటే 15 రోజులు అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఆ తర్వాత గడువును జనవరి 31 వ‌ర‌కు పొడిగించారు. టూ వీలర్లు, ఆటోల‌కు 80 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 90 శాతం, ఇత‌ర వాహ‌నాల‌కు 60 శాతం రాయితీ ప్ర‌క‌టించారు. దీంతో వీటి చెల్లింపులకు ప్రజల మంచి స్పంద‌న వ‌చ్చింది. ఖజానాకు కూడా భారీగానే ఆదాయం సమకూరింది.

Read Also: కేసీఆర్ అనుకుంటే రాజీవ్ గాంధీ పథకాలకు ఆ పేర్లు ఉండేవా?

గత ఏడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ వసూలుకావడం గమనార్హం.

Latest News

More Articles