Tuesday, May 7, 2024

మాదిగలకు ప్రధాన శత్రువు మోదీ, మందకృష్ణ.. దళిత జాతిని మరోసారి దగా చేశారు

spot_img

హైదరాబాద్: దళిత జాతిని మరోసారి దగా చేశారు. కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. మాదిగలకు రిజర్వేషన్లు కావాలని,  వర్గీకరించాలని ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది వాస్తవం కాదా? ప్రధాని హోదాలో మోడీ వర్గీకరణ పై ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు? అని నిలదీశారు. ఓట్ల కోసమే మాదిగ విశ్వరూప ప్రదర్శన సభ అంటూ ఆయన ఆరోపించారు.

Also Read.. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మితే గోసపడతాం

తెలంగాణ మాదిగ జాతి ని మందకృష్ణ ప్రధానికి తాకట్టు పెట్టారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మందకృష్ణ మరోసారి జిమ్మిక్కులు బయటపడ్డాయి.  మాదిగ జాతి చేతులెత్తి మొక్కిన మోడీ కనికరించలేదు. వర్గీకరణ చేస్తామని అనకుండా కమిటీ పేరుతో  కాలయాపన ఎందుకు? మాదిగలను మోసం చేసిన ప్రధాని మోదీ మందకృష్ణ మాదిగలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read.. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించుకోవాలి

మాదిగలకు ప్రధాన శత్రువు మోదీ, మందకృష్ణ. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్, బిజెపిలు మాదిగలను మోసం చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్ లో లక్షల మంది మాదిగల సాక్షిగా అదే మైదానంలో ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు మాట ఇచ్చి మోసం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనేక బిల్లులు ప్రవేశపెట్టిన బిజెపి కి మాదిగ రిజర్వేషన్ బిల్లు గుర్తు రాలేదా? మాదిగలకు మొదటి ముద్దాయి బిజెపి, రెండో ముద్దాయి కాంగ్రెస్ అని అన్నారు. 30 ఏళ్లుగా వర్గీకరణ సాధన కోసం మాదిగ, మాదిగ ఉపకులాలుచేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. ప్రజాస్వామికమైనది. వర్గీకరణ పై గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహర కమిషన్ వేసి మోసం చేసిందని మండిపడ్డారు.

Latest News

More Articles