Monday, May 6, 2024

రూ.47.66లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌

spot_img

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. మొత్తం రూ.47.66లక్షల కోట్లతో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఆదాయాన్ని రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అన్ని రంగాల్లో భారత్ వెలిగిపోతుందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు.

కేటాయింపుల ఇలా..

  • మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
  • ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
  • ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
  • రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
  • రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
  • హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
  • వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
  • ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
  • రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
  • కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
  • గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
  • సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
  • గ్రీన్‌ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు
  • సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు

Also Read.. సీఎంని మించిన క్రేజ్.. కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్న కేసీఆర్ ఎంట్రీ

Latest News

More Articles