Wednesday, May 8, 2024

ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

spot_img

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read..అఖిల్ బెయిల్ రిజెక్ట్ చేసిన కోర్టు..!

ఈ  సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ నాయకులు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని  అసెంబ్లీలో పెట్టాలని గత వారం ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారని, ఇది రాజకీయ డిమాండ్ కాదన్న ఆయన ప్రజల ఆకాంక్ష మేరకే స్పీకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారని అన్నారు. గతంలో అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండు చేసినప్పుడు గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 2వ వారంలో  ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తమన్నారు. అయినా తమ డిమాండ్ కు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తామని హెచ్చరించారు. బలహీన వర్గాల బీసీ వర్గాల ఆస్తిత్వం మా పూలే. ఏప్రిల్ 11లోపు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ నాయకులు తాడూరి శ్రీనివాస్, ఆలకుంటా హరి, గౌతమ్ ప్రసాద్, పూసలు శ్రీనివాస్, ఎం.బి.సి నాయకులు దుగుంట్ల నరేష్, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read..పేదలపై దౌర్జన్యం.. ఇదేనా ప్రజా పాలన..!

Latest News

More Articles