Friday, May 10, 2024

తోటలో 9 కేజీల భారీ ఉల్లిగడ్డ

spot_img

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని ఓ సామెత ఉంది. రోజూ ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతలా ఉంటుంది. అందుకే ఉల్లి గడ్డ లేకుండా వంట చేయడం కష్టం. నిత్యం వంటింట్లో గృహిణిలతో కన్నీళ్లు పెట్టించే ఉల్లి.. ఔరా అనేలా రికార్డు సృష్టించింది. మనం రోజూ వాడే ఉల్లిగడ్డలు మహా అయితే 200 గ్రాములకు మించవు. కానీ ఓ ఉల్లిగడ్డ మాత్రం ఏకంగా 9 కేజీల వరకు బరువు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read Also: ట్విట్టర్ ఖాతాదారులకు షాక్.. ప్రతి ఒక్కరూ నెలనెలా సర్వీస్ చార్జ్ చెల్లించాల్సిందే!

యూకేలోని గ్వెర్న్సీ ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ (65) ఎన్నో ఏళ్లుగా తోట సాగుచేస్తున్నాడు. వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలు పండించే ఆయన.. తన తోటలో ఓ భారీ ఉల్లిగడ్డను పండించాడు. ఇందుకోసం ఆయన ఒకటి కాదు, రెండు కాదు.. పన్నేండ ఏళ్లపాటు కష్టపడ్డాడు. ఈ ఉల్లిగడ్డను ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు. దాని బరువు దాదాపు 8.9 కిలోలుండగా.. పొడవు 21 అంగుళాలు ఉంది. అయితే ఇది ప్రపంచ రికార్డు అని ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. ఈ ఉల్లిగడ్డ పండించడం కోసం చాలా కష్టపడ్డానని గారెత్ గ్రిఫిన్ అంటున్నారు. తన తండ్రి పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసేవారని.. ఆయనను తాను కూడా ఓ పెద్ద ఉల్లిగడ్డను సాగుచేసి రికార్డు సృష్టించాలనుకున్నట్లు తెలిపారు. ఈ ఉల్లిగడ్డను పండించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని గారెత్ తెలిపారు. ఈ భారీ సైజ్ ఉల్లిగడ్డలతో వంట కూడా చేసుకోవచ్చని అయితే సాధారణ ఉల్లిపాయల కంటే వీటి రుచి కొంచెం తక్కువగా ఉంటుందని గారెత్ అంటున్నారు.

Read Also: ప్రేమించట్లేదని యువతికి పురుగుల మందు తాగించిన ఇద్దరు పిల్లల తండ్రి

Latest News

More Articles