Monday, May 6, 2024

అప్పులు కాదు ఆస్తులు పెంచాం.. కాంగ్రెస్ పై వినోద్ కుమార్ ఫైర్

spot_img

కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఆస్తుల గురించి కూడా చెప్పాల్సిందని ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం మానవీయ కోణంలో పని చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారులు చెప్పిన రిపోర్ట్ ల ఆధారంగా పని చేస్తుందని, అప్పులు కాదు ఆస్తులు పెంచినామని,  ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే విస్మరించిందన్నారు. ఆసుపత్రులు పట్టణం బయట ఉండాలని, జైలు పట్టణంలో ఉండాలని మంత్రి కొండా సురేఖ మాట్లాడారని, రైతు ఏ కారణంతో చనిపోయిన రైతుబీమ అందజేస్తే రైతు ఆత్మహత్యలు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Also Read.. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు పచ్చి అబద్దం

అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారు. గతంలో నెర్రెలుబారిన నేలలు,బీడు భూములు కనిపించేవి.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్  దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు నేడు  పచ్చబడ్డాయి. రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు 72వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన ప్రపంచంలోనే ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి.పరిశ్రమలు పవర్ హాలిడే ప్రకటించిన పరిస్థితి.కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.

Also Read.. మెట్రో నిండా మగాళ్లే.. ఊహించని పరిస్థితి

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.దళిత బంధు పథకం ద్వారా దళితులు ధనవంతులుగా మారేందుకు దళితబంధు పథకం కింద ఒక్కో యూనిట్ కు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు 25వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 1022గురకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై 1లక్ష 25వేల రూపాయల ఖర్చు చేసాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను నిర్మించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసినం, కొత్త ప్రాజెక్టులు కట్టినం. ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించాం. వరంగల్ లో 24 అంతస్తుల ఆసుపత్రిని నిర్మించామన్నారు.

Also Read.. 364 రోజులూ స‌ర్‌ప్ల‌స్‌లో ఉన్నాం

అప్పులు కాదు ఆస్తులు పెంచాం. 33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు. 2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు, రాష్ట్రంలో  ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు, 8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం, కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు, 1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు, 7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్,  23,37 654 మంది విద్యార్థులకు లబ్ధి,  కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్ 70 గదుల నిర్మాణం , 250 మందికి సరిపడేలా అంగన్వాడీ కేంద్రం, 1000 మంది కూర్చునేల డైనింగ్ హాల్, 22.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, 334 చిన్న పరిశ్రమల పురుద్దరణ, హెచ్ఎండీఏ పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లాకులు, 19472 పల్లె ప్రకృతి వనాలు  13657ఎకరాల విస్తీర్ణం, 109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం, 1,00,691 కిమి రహదారి వనాలు, 10,886 కిమీ కందకల తవ్వకం, 19వేళ పల్లెల్లో పార్కులు, 2700 ట్రీ పార్కులు, 1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం, 2800 కోట్ల ఆలయాల అభివృద్ధి, 100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు, 75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం , 212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం, ఆరోగ్య శాఖలో 34000 హాస్పిటల్ బెడ్స్, 34000 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐ సీ యు కేంద్రాలు, 56బ్లడ్ బ్యాంక్ లు, 82 డయాలసిస్ కేంద్రాలు, 500 బస్తీ దవాఖానాలు, 1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్ , 1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ, 3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు, 585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ , 137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు , 10.13 లక్షల సీసీ కెమెరాలు, 20,115 పోలీసు వాహనాలు, 9 కమీషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు, కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం, విద్యుత్ రంగం  2014లో  7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు, 15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం, వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం , 57.82 శాతం  తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది, లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు, 2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు, 2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు , 2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు, 59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఈ 10 ఏళ్లలో 70, 965.75 కోట్ల తో నిధులు ఖర్చు, దళిత బంధు పథకం అమలు, 5000 కోట్లతో గొర్రెల పంపిణీ , 72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల, 5402 కోట్ల రైతు బీమా , 572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు, 1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం.. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అని పేర్కొన్నారు.

Latest News

More Articles