Monday, May 6, 2024

తెచ్చిన అప్పులతో.. విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిని పెంచాం

spot_img

హైదరాబాద్: 2014 జూన్‌ 2 నాటికి విద్యుత్‌ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని తెలంగాణ మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని  సభలో వివరించారు. శాసన సభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. ఆనాడు తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితిని ఆయన వివరించారు.

Also Read.. కాంగ్రెస్ మాట తప్పింది.. కడియం శ్రీహరి నిప్పులు

దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ తన స్టేట్‌ ఎనర్జీ అండ్‌ క్లైమెట్‌ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. వ్యవసాయానికి కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని ఆయన వివరించారు.

Latest News

More Articles