Wednesday, May 8, 2024

చైనాకు ఎదురుదెబ్బ.. తైవాన్‌ ప్రెసిడెంట్‌గా విలియం లై షింగ్‌!

spot_img

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం విజయంకు 40.2శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన విలియంకు ప్రత్యర్థి హౌ యు-ఇహ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి హౌ యు ఇహ్‌కు 33.4 శాతం ఓట్లు పోలయ్యాయి.

Also Read.. అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్ రైల్వే గుడ్‎న్యూస్..

కాగా,  విలియంకు ఓటేయొద్దని చైనా తైవాన్‌ పౌరులను హెచ్చరించింది. చైనా ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ విలియంకే ప్రజలు పట్టం కట్టడం గమనార్హం. చైనాతో షరతులతో కూడిన ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విలియం స్పష్టం చేశారు. తైవాన్ పార్లమెంట్‌లో ఉన్న 113 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు.

Latest News

More Articles