Saturday, May 4, 2024

పంది కిడ్నీ అమర్చి ప్రాణాలు కాపాడిన వైద్యులు.!

spot_img

అమెరికా వైద్యులు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మృత్యువుకు చేరువైంది. ఆమె జీవించాలనే ఆశలన్నీ కోల్పోయింది. ఆమె కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు పంది కల్చర్డ్ కిడ్నీని మార్పిడి చేయడం ద్వారా మహిళ ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మృత్యువు అంచున నిలబడిన ఓ మహిళ…తన జీవితంపై ఆశలన్నీ కోల్పోయి తుది శ్వాసలు లెక్కపెడుతున్న సమయం. ఆ మహిళకు మళ్లీ ప్రాణం పోసిన వైద్యుడే దేవుడయ్యాడు. రెండు కిడ్నీలు చెడిపోయి చావులకు అంచులకు వెళ్లిన మహిళకు..ఇతరుల కిడ్నీలు అమర్చేందుకు అందుబాటులో లేవు. తాను బతకడం కష్టమని భావించింది. ఈ సమయంలోనే వైద్యులు ఆమెకు పందికిడ్నీని అమర్చి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ మహిళకు పంది కిడ్నీని శరీరంలోకి అమర్చి యాంత్రికంగా ఆమె గుండె చప్పుడును పునఃప్రారంభించడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడారు. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతం కంటే తక్కువ కాదు. లిసా పిసానో అనే మహిళకు గుండె, మూత్రపిండాల వైఫల్యం ఉంది. సాంప్రదాయ అవయవ మార్పిడి సాధ్యం కానంతగా అస్వస్థతకు గురైంది. NYU లాంగోన్ హెల్త్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌లోని వైద్యులు ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నారు. దీనిలో మహిళ హృదయ స్పందనను నిర్వహించడానికి మెకానికల్ పంప్‌ను అమర్చారు. కొన్ని రోజుల తరువాత జన్యుపరంగా మార్పు చెందిన పంది నుండి మూత్రపిండాన్ని మార్పిడి చేశారు.

అయితే ఆ మహిళకు పంది కిడ్నీని మార్చడం అంత సులభం కాలేదు. గత నెలలో ఆమె మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. పిసానో ఆరోగ్యం మెరుగుపడుతోందని NYU బృందం బుధవారం ప్రకటించింది. పంది కిడ్నీని శరీరంలో అమర్చుకున్న రెండో మహిళ ఆమె. “నా ఆశలన్నీ పోయాయి,” నేను ఇక బతకను అనుకునే సమయంలో వైద్యులు కాపాడారు అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: పేకాటరాయుళ్లతో పుట్టిన రోజు వేడుకలు..డీఐ మహేందర్ రెడ్డి సస్పెన్షన్.!

Latest News

More Articles