Monday, May 6, 2024

గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు మృతి

spot_img

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇఫ్పుడు పుట్టిన బిడ్డకు కూడా గుండెపోటు వచ్చిన ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.

Read Also: సినిమాల కోసం కలెక్టర్ కొలువుకు రాజీనామా

సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. తడ్కల్ గ్రామంలో 12 ఏళ్ల బాలుడు ఖలీల్ గుండెపోటుకు గురయ్యాడు. నిద్రలోనే అపస్మారకస్థితిలోకి బాలుడు వెళ్లడంతో గమనించిన కుటుంబసభ్యులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పన్నెండేళ్ల వయసులోనే కొడుకు గుండెపోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Read Also: కొమురెల్లి మల్లన్నకు ఐటీ నోటీసులు.. ఇన్‌కం ట్యాక్స్‌ కట్టలేదని రూ. 3 కోట్ల ఫైన్

పిల్లల శారీరక శ్రమ తగ్గడమే ఈ గుండెపోట్లకు కారణమని వైద్యులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటుంటారు. ఇది కూడా ఒక కారణంగా మారుతోంది. అంతేకాకుండా పిల్లలు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీకి అతుక్కోవడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతోంది.

Latest News

More Articles