Sunday, May 5, 2024

తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ భయపడరు.. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బొందపెడతాం

spot_img

నిజామాబాద్ జిల్లా లక్కొరాలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఒకవిధమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ బాల్కొండలో మూడోసారి తాను గెలవడం మామూలు విజయం కాదని అన్నారు.

Read also: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

‘తెలంగాణ వనరులు దోపిడీకి గురైతున్న సమయంలో ఒక్కడుగా బయలుదేరి అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‎గా నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్‎కు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే బాధ ప్రజలందరిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్.. ప్రజాదర్బార్‎లో ఒక్కరోజు మాత్రమే పాల్గొని పత్తాలేకుండా ఎక్కడికి వెళ్లారు. ప్రగతి భవన్‎లో కాకుండా వేరే చోట ఎందుకు ఉంటున్నారో సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కేవలం 50 రోజుల్లో 14 వేల కోట్ల అప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి? బీఆర్ఎస్ అధికారం పోవటానికి ఎన్నో కారణాలున్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్లు.. బీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాం తప్ప ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. దక్షణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా గత నాలుగు దశాబ్దాలుగా రెండుసార్లు కంటే ఎక్కువ ఏ పార్టీలు గెలవలేదు.

Read Also: ఎస్సై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మహిళా కానిస్టేబుల్ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుందని నమ్మకం లేదు. వాళ్ళు ధర్మ బద్ధంగా గెలవలేదు. గుంటకాడ నక్కల్లా కాంగ్రెస్ నాయకులు పనిచేశారు. అర్థం పర్థం లేకుండా చేసిన అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మిండ్రు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేయటం వల్ల పార్టీ నిర్మాణానికి పూర్తి స్థాయి సమయం ఇవ్వలేకపోయాం. తెలంగాణ బాగుపడితే పార్టీ బాగున్నట్లే అని నమ్ముకుని నిర్లక్ష్యం చేశాం. రాజకీయాలు, అభివృద్ధి వేరు వేరు అని గ్రహించలేదు. రాష్ట్ర ప్రజలంతా తన బిడ్డలే అనే భావనతో కేసీఆర్ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారు. దళితబంధు వంటి పధకాలను ప్రతిపక్షాలు రాజకీయానికి వాడుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది అంతే. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను పసిగట్టలేకపోయాం. కేసీఆర్ ప్రజా దర్బార్ పెట్టలేదు అని డాంబికాలు కొట్టిన రేవంత్ రెడ్డి.. కేవలం ఒక్కరోజే ప్రజా దర్బార్‎లో పాల్గొన్నారు. ప్రజా దర్బార్‎లో ఇపుడు అధికారులు తప్ప ముఖ్యమంత్రి కలవటం లేదు. అమలుకు నోచుకోని 420 మోసపూరిత హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై అందరూ నిలదీయాలి. రుణ మాఫీ, రైతుబందు, 200 యూనిట్ల ఉచిత కరెంట్,పెన్షన్, తులం బంగారం.. వీటన్నింటిపై కాంగ్రెస్ నాయకులను బాజాప్తా నిలదీయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటమే లక్యంగా పనిచేయాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే హామీలు అమలు చేయమని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు, వైఎస్ లాంటి వారితోనే కాలేదు.. రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవటం సాధ్యమా? తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ భయపడరు. ఇచ్చిన హామీలన్నీ పార్లమెంట్ ఎన్నికలలోపు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం’ అని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

Latest News

More Articles