Thursday, May 9, 2024

బీఆర్ఎస్ హవా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ

spot_img

మహబూబ్ నగర్: అధికార బీఆర్ఎస్ పార్టీ హవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అయిపోయాయని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన బీజేపీ,  కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సహా సుమారు 100 మందికి పైగా మంత్రి సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read.. వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు..దేశంలో తెలంగాణ రికార్డు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే నాయకులకు ఓట్ల రూపంలో తగిన గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలంతా అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని, నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్ లో మరోసారి బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకుంటారని అన్నారు. రాష్ట్రమంతా అధికార బీఆర్ఎస్ పార్టీ గాలి వీస్తోందని… గెలిచేది, నిలిచేది తామేనని స్పష్టం చేశారు.

Latest News

More Articles