Wednesday, May 8, 2024

వాహనదారులకు ఫ్రీగా గ్యాస్ కొట్టించిన క్రికెటర్

spot_img

అతడు క్రీజులోకి వ‌చ్చాడంటే బౌల‌ర్లు వ‌ణికిపోయేవాళ్లు. బంతిని దంచ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకునే ఈ డాషింగ్ బ్యాట‌ర్ నెల‌కొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఆట‌కు వీడ్కోలు పలికిన ఆ లెజెండ‌రీ క్రికెట‌ర్ ఎవరో కాదు.. వెస్టిండీస్ మాజీ ఓపెన‌ర్ క్రిస్ గేల్‌. ఆయన తాజాగా ఓ గ్యాస్ స్టేషన్‎లో చేసిన పనితో వార్త‌ల్లో నిలిచాడు. పోర్ట్‌మోర్ గ్యాస్ స్టేష‌న్‌లో వాహ‌న‌దారుల‌కు ఉచితంగా గ్యాస్ కొట్టించి, వారితో సెల్ఫీలు కూడా దిగాడు. లెజెండ‌రీ క్రికెట‌ర్‌ త‌మ‌తో అంత క‌లివిడిగా ఉండడం చూసి వాహ‌న‌దారులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. గేల్ చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Read Also: ఓఆర్ఆర్ పక్కన మూటలో కుళ్లిన మృతదేహం

జ‌మైకాకు చెందిన గేల్ 1999లో క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. విధ్వంస‌క ఇన్నింగ్స్‌ల‌తో అన‌తికాలంలోనే డేంజ‌రస్ బ్యాట‌ర్‌గా గుర్తింపు పొందాడు. టెస్టులు, వ‌న్డేలు, టీ20లు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. విండీస్ జ‌ట్టు 2004లో చాంపియ‌న్స్ ట్రోఫీ, 2012,2016లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో గేల్ కీల‌క పాత్ర పోషించాడు. మొత్తంగా కెరీర్‌లో 19,593 ర‌న్స్ కొట్టిన ఈ క‌రీబియ‌న్ వీరుడి ఖాతాలో 147 హాఫ్ సెంచ‌రీలు, 42 సెంచ‌రీలు ఉన్నాయి. గేల్ 2019లో 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌కు, 2021లో టీ20ల‌కు, 2022లో ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికాడు.

Latest News

More Articles