Saturday, May 4, 2024

బంగాళాఖాతంలో హ‌మూన్‌ తుపానుగా మారిన అల్ప‌పీడ‌నం

spot_img

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణ శాఖ హ‌మూన్ అని నామ‌క‌ర‌ణం చేసింది. తుపాను ప్ర‌భావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రేపు(బుధవారం) బంగ్లాదేశ్‌లోని హెపుప‌రా, చిట్ట‌గాంగ్ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

అయితే హ‌మూన్ తుపాను కార‌ణంగా భార‌త తీరంపై అంత‌గా ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పింది ఐఎండీ. సోమ‌వారం సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీట‌ర్లు, ప‌శ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 360 కిలోమీట‌ర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుప‌రాకు 510 కిలోమీట‌ర్ల దూరంలో తుపాను కేంద్రీకృత‌మైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

తుపాను నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్ర‌భావం ఉండ‌న‌ప్ప‌టికీ, జాల‌ర్లు ఎవ‌రూ బుధ‌వారం వ‌ర‌కు వేట‌కు వెళ్లొద్ద‌ని అధికార యంత్రాంగం సూచించింది. తీర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

ఇది కూడా చదవండి: న‌వంబ‌ర్ 1 నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేత‌న పెంపు

Latest News

More Articles