Sunday, May 5, 2024

ధోనీ రికార్డు బ‌ద్ధ‌లు కొట్టిన లెగ్ స్పిన్న‌ర్

spot_img

న్యూఢిల్లీ: ద‌క్షిణాఫ్రికా మాజీ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్‌ టీ20 క్రికెట్‌ లో చ‌రిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల అత‌డి కెప్టెన్సీలో గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్ తొలిసారి క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2023 ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. దాంతో  పెద్ద వ‌య‌సులో టీ20 ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా తాహిర్ గుర్తింపు సాధించాడు.

Also Read.. సీఎం కేసీఆర్‌కు ఫుల్ స‌పోర్టు.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

అంతకుమందు భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును తాహిర్ బ్రేక్ చేశాడు. మిస్టర్ కూల్ 41 ఏళ్ల వ‌య‌సులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ను ఐపీఎల్ 16వ సీజ‌న్‌ విజేత‌గా నిలిపి ట్రోఫీ అందుకున్నాడు. తాహిర్ చెన్నై త‌ర‌ఫున రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Also Read.. హర్భజన్ సింగ్ చెప్పినట్టే.. అదరగొట్టిన సూర్య

క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఐదుసార్లు ర‌న్న‌ర‌ప్‌గానే స‌రిపెట్టుకున్న గ‌యానా వారియ‌ర్స్.. ఈసారి ఛాపియ‌న్‌గా నిలిచింది. 44 ఏళ్ల తాహిర్ టోర్నీ ఆసాంతం సంచల‌న బౌలింగ్‌తో తన జట్టుకు విజయాలను అందించాడు. నిన్న జ‌రిగిన సీపీఎల్ ఫైన‌ల్లో కీర‌న్ పోలార్డ్ సారథ్యంలోని ట్రిన్‌బాగో నైట్ రైడ‌ర్స్‌పై 9 వికెట్లతో విజ‌యం సాధించింది.

Latest News

More Articles