Sunday, May 5, 2024

హైదరాబాద్‌లో మండి బిర్యానీ తిని 43 మందికి అస్వస్థత

spot_img

వీకెండ్‌ వస్తే చాలు చాలామంది స్నేహితులతోనో లేకపోతే ఫ్యామిలీతోనో కలిసి బయట తినడానికి వెళ్తుంటారు. వారమంతా బిజీబిజీగా గడిపేస్తుండటంతో వీకెండ్‌ రెస్టారెంట్స్‌ వైపు చూస్తున్నారు. అందుకే హైదరాబాద్ సిటీలో రెస్టారెంట్‌ బిజినెస్‌కి మంచి డిమాండ్‌ ఉంది.

Read Also: పేరే కాదు, ఇంటి పేరు కూడా సేమ్ టూ సేమ్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు.. అయోమయంలో ఓటర్లు

అయితే వీకెండ్‎లో ఓ రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్న 43 మంది అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలోని ఎమ్మెస్‌ మండి రెస్టారెంట్‌లో ఆదివాంర మండి బిర్యానీ తిన్నవారందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. సమాచారమందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ తయారుచేస్తున్న ఆహారపదార్థాలను ల్యాబ్‎కు పంపించారు. జీహెచ్ఎంపీ అధికారులు ఆ మండిని తాత్కాలికంగా మూసివేశారు.

Read Also: పెళ్లిలో రసగుల్లా కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న బంధువులు

మండి బిర్యానీలో ఎక్కువగా మయోనీస్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది తినడానికి బాగా రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. ఇందులో అధిక మోతాదులో సోడియం, కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఉండటం వల్ల గుండెకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

Latest News

More Articles