Wednesday, May 8, 2024

దమ్ముంటే ఎంక్వైరీ చేసుకో.. రేవంత్ కి కేటీఆర్ సవాల్..!

spot_img

బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్ళను. రాజకీయ జన్మను ఇచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటానన్నారు కేటీఆర్. ‘మూడు ఫీట్లు కూడా లేనాయన, బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతరపెడతాడట. మంచి, మంచి తీస్మార్ ఖాన్ లే కేసిఆర్ ను ఏం చేయలేకపోయారు, ఈ బుడ్డర్ ఖాన్ తో ఏమైతది. మాణిక్యం ఠాగూర్ కు యాబై కోట్లు ఇచ్చి.. మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రివి ఆయ్యావు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల నుండి తప్పించుకోకుండా చూడాలి. అవినీతి జరిగితే, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకో. రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి బోగస్ మాటలు చెబుతున్నారు.

ఇక వచ్చే పంట వరకు రైతు భరోసా ఇవ్వకుంటే, పార్టీ ని చీల్చి చెండాడుతరు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కింద లంకె బిందెలు ఉంటయని అనుకున్నడు. సాద్యం కాని హామీలు ఇచ్చారు. సిరిసిల్ల నేతన్నలకు నేను మాట ఇస్తున్నా, 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తం, మీకోసం ముందుంటాం. ఎవరులేని నాడే తెలంగాణా తెచ్చింది మనమే. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. ప్రజల పక్షాన ఐదేండ్లు నిలబడి కొట్లాడుదాం. ఒకరిద్దరు పోయినా పర్వాలేదు, మళ్ళీ కొత్తవారిని తయారు చేసుకుందాం. మెజారిటీ ఎందుకు తగ్గిందో చర్చించి, లోపాలను మార్చుకుందాం. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కోసం మీకంటే ఎక్కువ కష్టపడుతా. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా, వెంట పడాలని కార్యకర్తలకు సూచన అని చెప్పారు కేటీఆర్.

Latest News

More Articles