Friday, May 10, 2024

మోదీ దేశానికి ప్రధానా.. కర్ణాటకకు ప్రధానా ?

spot_img

తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి నష్టపోయిన వరి పంటను పరిశీలించి బీజేపీ, మోదీ చర్యలపై సీరియస్ అయ్యారు. అకాల వర్షాలతో తెలంగాణకి నష్టం జరిగినా.. ఇప్పటివరకు ప్రధాని స్పదించకపోవటం దారుణమన్నారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ఉచితలంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

మోడీ దేశానికి ప్రధానా…కర్ణాటక కు ప్రధానా.. తెలంగాణలో ఎందుకు నష్టపరిహారం ఇవ్వరు. ఆధాని ఎయిర్ పోర్ట్ కు జిఎస్టీ వేయరు. సామాన్యులు వాడే పాలు, పెరుగు మీద జిఎస్టీ వేస్తున్నారు అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరిగితే కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన ధాన్యం రోడ్ల మీద అరబోశారు. నష్ట పోయిన రైతులకు చేప్పింది ఒక్కటే. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. రైతు బంధు, భీమా, కరెంటు ఇచ్చి…నీళ్లు ఇచ్చి సీఎం కేసీఆర్ అండగా ఉంటారు అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

Latest News

More Articles