Friday, May 10, 2024

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో.!

spot_img

నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5ఏండ్ల లోపు పిల్లలకు నేడు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం బూత్ డే కాగా 4,5తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్లో 6వ తేదీన పట్టణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని హెల్త్ అండి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ తెలిపారు.

రాష్ట్రంలో 22,445 పోలియో బూత్‌లలో 40,57,320 మందికి పోలియో చుక్కలు వేసేందుకు 910 మొబైల్‌ టీమ్స్‌, 910 ట్రాన్సిట్‌ పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏర్పాట్లను 2245 సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తారన్నారు. 8754 ఏఎన్‌ఎంలు, 28,160 ఆశాలు, 35,700 మంది అంగన్‌వాడీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. 50.30 లక్షల డోసులను జిల్లాలకు పంపినట్టు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు..ప్రకటించిన విద్యాశాఖ.!

 

Latest News

More Articles