Saturday, May 11, 2024

తెలంగాణలో వచ్చే ఐదురోజులు దంచికొట్టనున్న ఎండలు.!

spot_img

రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండాకాలం పూర్తిగా షురూ అవ్వకముందే మంటపుట్టిస్తున్నాయి. మార్చి మొదటివారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్ధిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సూర్యపేట జిల్లా హుజూర్ నగర్, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: దేవుడు చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా?

Latest News

More Articles